Breaking News

టీటీడీ సభ్యత్వానికి జంగా రాజీనామా..


Published on: 09 Jan 2026 17:50  IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబు నాయుడుకి పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలంటూ ఆ లేఖలో సీఎం చంద్రబాబుకు జంగా కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలను ఆ లేఖలో జంగా వివరించినట్లు తెలుస్తోంది.గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్‌‌లో ప్లాట్ నెంబర్ 2 నేటికీ ఖాళీగానే ఉందని.. సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి