Breaking News

పోలీసు స్టేషన్ ఎదురుగానే కాపు కాచి..


Published on: 05 Jan 2026 12:04  IST

శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తనకల్లు మండల పోలీస్ స్టేషన్ ఎదుట ఈశ్వరప్ప అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈశ్వరప్పను రాగినేపల్లి గ్రామానికి చెందిన హరి, చిన్నప్ప హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. రాగినేపల్లి గ్రామంలో జరిగిన ఈ దారుణ హత్యా సంఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు హరి, చిన్నప్పలు పోలీసుల అదుపులో ఉన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి