Breaking News

వైసీపీ పాలనలో గేట్లకు గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదు..


Published on: 06 Jan 2026 18:58  IST

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సుబ్బరాయసాగర్‌కి నీటి విడుదలలో ఆలస్యమైందని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy) పేర్కొన్నారు. అనంతపురంలోని లక్ష్మీనగర్‌లో గల తన నివాసంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. సుబ్బరాయసాగర్‌ ప్రాజెక్ట్‌కి ఎప్పుడో నీరు రావాల్సిందన్నారు. గత వైసీపీ పాలకులు.. కనీసం గేట్లకు గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదన్నారు. గేటు సమస్యతో ఈ దపా నీటి పంపిణీలో ఆలస్యమైందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి