Breaking News

కోతుల సమస్యపై లోక్‌సభలో చర్చ


Published on: 04 Dec 2025 16:01  IST

కోతుల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దమొత్తంలో వానరాలు పంటలను పాడు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కోతుల సమస్యపై ఇవాళ(గురువారం) లోక్‌సభ జీరో అవర్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని కొన్ని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని.. ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.

Follow us on , &

ఇవీ చదవండి