Breaking News

రెండో విడత భూ సమీకరణకు ఆదేశాలు జారీ


Published on: 02 Dec 2025 17:02  IST

రాజధాని అమరావతి నిర్మాణానికి సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజధాని అభివృద్ధి కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. అందుకు సంబంధించిన ఆదేశాలను మంగళవారం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ జారీ చేశారు. ఏడు గ్రామాల్లో మొత్తం 16,666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణ బాధ్యతను సీఆర్డీఏకు అప్పగిస్తున్నట్లు ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి