Breaking News

కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క..


Published on: 08 Jan 2026 15:53  IST

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈరోజు (గురువారం) మంత్రి సీతక్క కలవనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత‌ను మంత్రి సీతక్క కలిసి.. మేడారం మహా జాతరకు ఆహ్వానించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు మరో మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొననున్నారు. మేడారం మహా జాతరకు సంబంధించి అధికారిక ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందజేయనున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి