Breaking News

కీసరలో దారుణం.. వ్యక్తిపై దాడి..


Published on: 08 Jan 2026 12:52  IST

కీసరలో దారుణం జరిగింది. గురువారం వేకువజాము ఓ వ్యక్తిపై తల్వార్‌తో దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వ్యక్తిని తెలంగాణ దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్‌‌గా గుర్తించారు. ఈ దాడితో స్థానికులు, పాల పరిశ్రమ నిర్వాహకులు భయాందోళనకు గురి అయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ దాడిపై వెంటనే మేడ్చల్ జిల్లా పోలీసులకు సమాచారం అందజేశారు.శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శ్రీనివాస్ మౌలాలి వాసిగా గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి