Breaking News

భస్మాసురునికి సోదరుడు కేటీఆర్‌


Published on: 05 Jan 2026 14:28  IST

భస్మాసురుని కజిన్‌ బ్రదర్‌ కేటీఆర్‌ అని, బంగారు తెలంగాణను భ్రష్టు పట్టించిన భస్మాసుర సైన్యం బీఆర్‌ఎస్‌ నాయకగణమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ దుయ్యబట్టారు. కేటీఆర్‌లో అహంకారం పరాకాష్టకు చేరుకుందన్నారు. నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ దుస్థితికి చేరుకుందని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, అందుకే 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేసిందని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి