Breaking News

ఆత్మగౌరవ పర్వం.. వెయ్యేళ్ల అఖండ విశ్వాసం


Published on: 05 Jan 2026 11:08  IST

సోమనాథ్‌... ఈ మాట చెవినబడగానే మన మనసు పులకరిస్తుంది. సగర్వ భావన కలుగుతుంది. ఇది భారతీయాత్మ అనంత స్పందన. ఈ అద్భుత ఆలయం పశ్చిమ భారత తీరంలోని గుజరాత్‌ రాష్ట్రం ప్రభాస్‌ పటాన్‌ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. దేశంలోని 12జ్యోతిర్లింగాల ప్రాశస్త్యాన్ని ’ద్వాదశ జ్యోతిర్లింగ‘ స్తోత్రం ప్రస్తుతిస్తుంది. ’సౌరాష్ట్రే సోమనాథం చ...‘ అంటూ ఆరంభమయ్యే ఈ స్తోత్రం, తొలి జ్యోతిర్లింగ నెలవుగా సోమనాథ్‌ నాగరికత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి