Breaking News

మంటల్లో బోగీలు


Published on: 30 Dec 2025 12:07  IST

విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటానగర్‌-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోగా, ఒకరు సజీవ దహనమయ్యారు. ఆ బోగీల లోపలి భాగంలో ఇనుప ఊచలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదాన్ని వెంటనే గుర్తించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు మరో ఐదు నిమిషాల్లో అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్‌కు చేరుకుంటుందనగా, మంటలు రేగాయి. 

Follow us on , &

ఇవీ చదవండి