Breaking News

చరిత్ర సృష్టించిన యువ సంచలనం!


Published on: 29 Dec 2025 15:59  IST

భూటాన్‌ యువ స్పిన్నర్‌ సోనమ్‌ యేషే క్రికెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. టీ20 చరిత్రలో ఏ ఆటగాడు సాధించని ఘనతను అతడు అందుకు న్నాడు. మయన్మార్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 8 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.22 ఏళ్ల యేషే కేవలం 7 పరుగు లే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టును కేవలం 45 పరుగులకే ఆలౌట్‌ చేశాడు.127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్‌ బ్యాటర్లు యేషే స్పిన్‌ ముందు పూర్తిగా చేతులెత్తేశారు.

Follow us on , &

ఇవీ చదవండి