Breaking News

క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్


Published on: 23 Dec 2025 11:41  IST

ఐపీఎల్ క్రికెటర్, కర్ణాటకకు చెందిన స్టార్ ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ఈ 37 ఏళ్ల స్టార్ ఆల్‌రౌండర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2012లో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచులో కర్ణాటక తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్‌ల ముఖ్యమైన వికెట్లను పడగొట్టాడు.తన దేశీయ కెరీర్‌లో కృష్ణప్ప.. 59 ఫస్ట్-క్లాస్, 68 లిస్ట్ ఏ మ్యాచుల్లో 320 వికెట్లు పడగొట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి