Breaking News

జాలరి వలలో చిక్కిన అరుదైన చేప


Published on: 18 Nov 2025 18:25  IST

జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను. రామనాథపురం జిల్లా పాంబన్‌ ఉత్తర తీరం నుంచి మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు. ఓ జాలరి వలలో అరుదైన ‘ఎల్లో టైల్‌ ట్యూనా’ అనే చేపతో పాటు పలురకాల చేపలున్నాయి. మూడు మీటర్ల వెడల్పు, 112 కిలోల బరువున్న ఈ చేపను నలుగురు జాలర్లు తీరానికి తీసుకొచ్చారు. ఆ చేపను కేరళకు చెందిన వ్యాపారి రూ.17 వేలకు కొనుగోలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి