Breaking News

డ్రగ్స్ ఓవర్ డోస్‌‌తో వ్యక్తి మృతి


Published on: 06 Nov 2025 12:31  IST

డ్రగ్స్‌ భూతం యువతను పట్టిపీడిస్తోంది. డ్రగ్స్‌కు అనేక మంది యువత బానిసలుగా మారిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి డ్రగ్స్ ఓవర్ డోస్‌తో ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ డ్రగ్స్‌కు బానిసగా మారాడు. డ్రగ్స్ తీసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. ఈ క్రమంలో నిన్న ఒక అపార్ట్‌మెంట్‌లో అలీ డ్రగ్స్ సేవించాడు. అయితే డ్రగ్స్ ఓవర్ డోస్‌గా తీసుకోవడంతో అలీ ప్రాణాలు కోల్పోయాడు.

Follow us on , &

ఇవీ చదవండి