Breaking News

విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు


Published on: 05 Nov 2025 14:33  IST

జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) శ్రీకాకుళం పట్టణంలో ఉమెన్స్ కళాశాలలో అదనపు భవనాల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో తన తల్లి కూడా చదివారని తెలిపారు. స్టేట్‌‌లో అధికంగా ఈ మహిళా కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. రూ. 99 లక్షలతో 5 తరగతి గదులు నిర్మించామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి