Breaking News

ఏ శాఖ ఇచ్చినా ఓకే: మంత్రి అజారుద్దీన్


Published on: 31 Oct 2025 15:28  IST

తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఇవాళ(శుక్రవారం) ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు అజారుద్దీన్‌తో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. మంత్రివర్గంలో అజారుద్దీన్‌ చేరికతో తెలంగాణ కేబినెట్‌ మంత్రుల సంఖ్య 16కి చేరింది. అయినా తెలంగాణ కేబినెట్‌లో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే..ఈ సందర్భంగా నూతన మంత్రి అజారుద్దీన్‌‌కి సీఎం రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలోకి ఆహ్వానం పలికారు.

Follow us on , &

ఇవీ చదవండి