Breaking News

రైల్వే స్టేష‌న్‌లో ప్ర‌యాణికుడికి త‌ప్పిన ప్ర‌మాదం..


Published on: 28 Oct 2025 15:49  IST

వ‌రంగ‌ల్‌కు చెందిన మ‌ణిదీప్ అనే వ్య‌క్తి బెంగ‌ళూరు వెళ్లేందుకు ఈ నెల 26న కాచిగూడ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చాడు. ఇక బెంగ‌ళూరు వెళ్లాల్సిన రైలు ఎక్కాల్సి ఉండ‌గా, తొంద‌ర‌లో మ‌రో రైలు ఎక్కాడు. దీంతో ఆ రైలు దిగేందుకు య‌త్నించ‌గా.. అప్ప‌టికే రైలు వేగంగా ముందుకు క‌దిలింది. దీంతో మ‌ణిదీప్ రైలు చ‌క్రాల కింద ప‌డ‌బోయాడు. గ‌మ‌నించిన తోటి ప్ర‌యాణికులు, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అప్ర‌మ‌త్త‌మైన అత‌డిని ప‌క్క‌కు లాగారు. దీంతో మ‌ణిదీప్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

Follow us on , &

ఇవీ చదవండి