Breaking News

బాలుడి ప్రాణం తీసిన కైట్..


Published on: 20 Jan 2026 16:34  IST

కైట్ ఎగరవేస్తూ.. భవనంపై నుంచి కిందపడి కార్తీక్ అనే 12 ఏళ్ల బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో చోటు చేసుకుంది. కార్తీక్.. సోమవారం తమ రెండస్తుల భవనంపై గాలిపటం ఎగరవేస్తున్నాడు. ఆ క్రమంలో భవనంపై నుంచి ప్రమాదవశాత్తూ జారి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి.. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి