Breaking News

డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్


Published on: 03 Jan 2026 18:01  IST

భాగ్యనగరంలోని నానక్‌రామ్‌గూడలో ఇవాళ(శనివారం) ఈగల్ టీమ్‌ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి  కుమారుడు సుధీర్‌రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సుధీర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని చెక్ చేశారు.ఈ పరిశీలనలో సుధీర్‌‌రెడ్డి కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయనని అరెస్ట్ చేసి, డీ-అడిక్షన్ సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం సుధీర్‌రెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి