Breaking News

ఆలయానికి ముస్లిం వ్యాపారి రూ.కోటి విరాళం


Published on: 05 Nov 2025 15:00  IST

హిందూ ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఘటన ఇది. కర్ణాటకలోని బెంగళూరు దక్షిణ జిల్లా చెన్నపట్టణ మంగళవారపేటలో శ్రీబసవేశ్వర స్వామి ఆలయం ఉంది. దీని జీర్ణోద్ధరణ పనులకు ప్రముఖ వ్యాపారవేత్త సయ్యద్‌ ఉల్లా సఖాఫ్‌ రూ.కోటి విరాళం ఇచ్చారు. పూర్తిగా తన సొంత ఖర్చుతో పనులన్నీ చేయించారు. మూడు రోజుల క్రితం ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈ ఆలయ విస్తరణకు వీలుగా స్థానికులైన కెంపమ్మ, మోటేగౌడ తమ స్థలం కేటాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి