Breaking News

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఐదు కార్లు దగ్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుట్టమల్లారం ఏరియాలోని ఒక కారు రిపేర్ షెడ్డు (సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం) లో అకస్మాత్తుగా సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Published on: 16 Jul 2026 15:39  IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుట్టమల్లారం ఏరియాలోని ఒక కారు రిపేర్ షెడ్డు (సెకండ్ హ్యాండ్ కార్ల షోరూం) లో అకస్మాత్తుగా సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మణుగూరు పట్టణ పరిధిలోని గుట్టమల్లారం ప్రాంతంలో ఉన్న కారు షెడ్. అకస్మాత్తుగా జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్.మంటలు క్షణాల్లో వ్యాపించడంతో షెడ్డులో ఉన్న ఐదు కార్లు పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ భారీ అగ్నిప్రమాదంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇతర వాహనాలకు, ఆస్తులకు మరింత నష్టం జరగకుండా నివారించగలిగారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement