Breaking News

ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు

ఇస్రో (ISRO) చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, సెప్టెంబర్ 4న జరగబోయే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన నమూనా (రాకెట్ మోడల్)ను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Published on: 02 Sep 2026 10:53  IST

ఇస్రో (ISRO) చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్, తిరుమల శ్రీవారిని దర్శించుకుని, సెప్టెంబర్ 4న జరగబోయే జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగానికి సంబంధించిన నమూనా (రాకెట్ మోడల్)ను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు (2 సెప్టెంబర్ 2026, బుధవారం) ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. పూజల అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ప్రయోగ తేదీ ,సమయం: సెప్టెంబర్ 4, 2026 తెల్లవారుజామున 02:55 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుండి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఉపగ్రహం : ఈ రాకెట్ ద్వారా EOS-05 లేదా GISAT-1A అనే అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. దీని బరువు సుమారు 2,367 కిలోలు.

ఉపయోగం: జియోసింక్రనస్ ఆర్బిట్ (భూస్థిర కక్ష్య) నుండి పనిచేయనున్న భారతదేశపు మొట్టమొదటి నిరంతర ఇమేజింగ్ శాటిలైట్ ఇది. ఇది దేశ సరిహద్దుల నిరంతర పర్యవేక్షణ , వాతావరణ అంచనా, వరదలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తులను ముందే గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ప్రతి ప్రధాన ప్రయోగానికి ముందు రాకెట్ నమూనాతో తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేయడం ఇస్రో శాస్త్రవేత్తలకు ఒక సెంటిమెంట్‌గా వస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి