Breaking News

హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం

హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘటన జూన్ 8, 2026న జరగగా, దీనికి ప్రతికారంగా జూన్ 9, 10 తేదీల్లో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య భారీగా పరస్పర దాడులు జరిగాయి.


Published on: 10 Jun 2026 10:58  IST

హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘటన జూన్ 8, 2026న జరగగా, దీనికి ప్రతికారంగా జూన్ 9, 10 తేదీల్లో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య భారీగా పరస్పర దాడులు జరిగాయి.

హార్ముజ్ జలసంధి ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అమెరికా ఆర్మీకి చెందిన అధునాతన అపాచీ యుద్ధ హెలికాప్టర్‌ను ఇరాన్ వన్-వే అటాక్ డ్రోన్‌తో కూల్చివేసిందని అమెరికా అధికారులు తెలిపారు.హెలికాప్టర్‌లోని ఇద్దరు అమెరికన్ పైలట్లు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. చరిత్రలోనే మొదటిసారిగా ఒక అమెరికన్ సీ డ్రోన్ (యూఎస్ నేవీకి చెందిన మానవరహిత బోట్) రంగంలోకి దిగి కేవలం రెండు గంటల్లో వీరిని రక్షించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దీనికి తగిన సమాధానం చెప్పి తీరుతామని ప్రకటించారు.

అమెరికా ప్రతీకార దాడులు

అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదేశాల మేరకు, ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా అమెరికా సైన్యం భారీ వైమానిక దాడులు ప్రారంభించింది.ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాలైన ఖేష్మ్ ఐలాండ్ (Qeshm Island), సిరిక్, జాస్క్, బందర్ అబ్బాస్ లలోని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రాడార్ కేంద్రాలను అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి.

ఇరాన్ ఎదురుదాడి

అమెరికా దాడులకు స్పందిస్తూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కూడా ఎదురుదాడికి దిగింది.బహ్రెయిన్, జోర్డాన్, కువైట్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. బహ్రెయిన్‌లోని అమెరికా 5th ఫ్లీట్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ తమ భూభాగంపై జరిగే ఏ దాడిని వదిలిపెట్టబోమని, సురక్షితంగా ఉండాలంటే అమెరికా దళాలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరించారు.

ఈ అపాచీ హెలికాప్టర్ కూల్చివేత ఘటనతో అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలకు తీవ్ర విఘాతం కలిగింది. ప్రాంతీయంగా యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి