Breaking News

ట్రంప్‌-జిన్‌పింగ్‌ మీటింగ్ ఎఫెక్ట్‌


Published on: 05 Nov 2025 15:31  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీ (Trump-Jinping Meeting) తర్వాత రెండు దేశాల మధ్య ట్రేడ్‌వార్ కాస్త సద్దుమణిగింది. ఆ ఫలితంగా సుంకాల విషయంలో కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. అమెరికా వస్తువులపై ఉన్న అదనపు 24 శాతం సుంకాల సస్పెన్షన్‌ను పొడిగిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ పొడిగింపు ఏడాది పాటు అమల్లో ఉండనుంది. పది శాతం టారిఫ్‌ మాత్రం కొనసాగనుంది. నవంబర్ 10 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

Follow us on , &

ఇవీ చదవండి