Breaking News

టోల్ వసూళ్లను నిలిపేయండి..


Published on: 02 Jan 2026 18:17  IST

సంక్రాంతి సందర్భంగా టోల్‌ప్లాజాలో టోల్ వసూళ్లను నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టీడీపీ ఎంపీ సనా సతీష్ కోరారు. సంక్రాంతికి హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఏపీలోని సొంత గ్రామాలకు వస్తారని.. ఫలితంగా హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టోల్‌ వసూళ్లు నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు.తమ విజ్ఞప్తిని పరిశీలించాలంటూ కేంద్ర మంత్రిని కోరారు ఎంపీ.

Follow us on , &

ఇవీ చదవండి