Breaking News

మేం ప్రపంచ కప్ ఆడితే రూ.వెయ్యి ఇచ్చారు


Published on: 04 Nov 2025 15:46  IST

ఐసీసీ వన్డే మహిళల ప్రపంచ కప్ 2025లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీనికి హర్మన్ సేనకు బీసీసీఐ రూ.51కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ‘మహిళల వన్డే ప్రపంచ కప్ 2003 ఫైనల్ ఆడినప్పుడు ఒక్క మ్యాచ్‌కు రూ.వెయ్యి ఇచ్చారు. ఆ టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే ఒక్కో ప్లేయర్‌కు రూ.8వేలు వచ్చాయి. అప్పట్లో మహిళల క్రికెట్ పరిస్థితి దయనీయంగా ఉండేది. మ్యాచ్ ఫీజులు, జీతాలు వంటివి క్రికెటర్లకు లేవు’ఓ షోలో వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి