Breaking News

ఈ ప్రిన్సిపాల్‌ మాకొద్దు


Published on: 03 Nov 2025 12:57  IST

నిత్యం తమను వేధిస్తున్న ప్రిన్సిపాల్‌ శైలజను సస్పెండ్‌ చేయాలంటూ నాగర్‌కర్నూల్‌ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు కదం తొక్కారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ ప్రధాన కూడలిలో 400 మందికి పైగా విద్యార్థినులు సుమారు 6 గంటల పాటు ధర్నా చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడామని, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని షాద్‌నగర్‌ సీఐ విజయకుమార్‌ తెలిపినా వినలేదు. చివరి కి పోలీసులు విద్యార్థినులను ఒప్పించి పోలీస్‌స్టేషన్‌కు తరలించి.స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి