Breaking News

చిరుత సంచారం ఉంది.. గుంపులుగా వెళ్లండి


Published on: 01 Nov 2025 11:36  IST

శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది. అనంతరం భక్తులు టీటీడీ సెక్యూరిటీకి సమాచారమిచ్చారు.టీటీడీ సెక్యూరిటీ అప్రమత్తమై భక్తులను గుంపులు గుంపులుగా తిరుమలకు అనుమతించారు. చిన్న పిల్లలను జాగ్రత్తగా తీసుకెళ్ళాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి