Breaking News

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు..


Published on: 04 Jun 2025 15:47  IST

తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే టీడీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే.. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా రెండు రోజుల నుంచి సిట్ అధికారులు అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు తిరుమల ఉద్యోగులను సిట్‌ విచారిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement