Breaking News

చరిత్ర సృష్టించిన ఏపీఎస్‌ఆర్టీసీ


Published on: 20 Jan 2026 13:48  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) ఆదాయంలో రికార్డ్‌ సృష్టించింది.జనవరి 19న ఒక్క రోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం సాధించింది. ఆర్టీసీ చరిత్రలోనే అత్యధిక రోజువారీ ఆదాయ రికార్డ్‌ను నెలకొల్పింది.జనవరి 19న ఆర్టీసీబస్సుల్లో అత్యధికంగా 50.6 లక్షలమంది ప్రయాణించారు.సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలంతా సొంతూళ్ల నుంచి తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేకంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసింది ఆర్టీసీ.

Follow us on , &

ఇవీ చదవండి