Breaking News

డ్రోన్లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు...


Published on: 13 Jan 2026 11:06  IST

పాకిస్థాన్ మరోసారి కవ్వింపులకు దిగింది. భారత సైనిక వర్గాల సమచారం ప్రకారం, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన కొన్ని డ్రోన్లు ముఖ్యంగా నౌషెరా-రాజౌరీ సెక్టార్‌లో సంచరిస్తున్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే సైనిక విభాగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. మీడియం, లైట్ మిషన్‌గన్‌లతో కాల్పులు జరిపాయి. పాక్ డ్రోన్‌ కదలికలతో ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భద్రత, నిఘాను మరింత కట్టుదిట్టం చేశామని, భారత బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని సెక్యూరిటీ అధికారులు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement