Breaking News

మహిళా కానిస్టేబుల్‌ను అభినదించిన మంత్రి


Published on: 20 Jan 2026 16:11  IST

మహిళా కానిస్టేబుల్‌ జయశాంతికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందనలు తెలిపారు. కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ అవ్వగా.. దానిని కానిస్టేబుల్ జయశాంతి క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.జయశాంతి లాంటి పోలీసుల వల్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత తెలిపారు. జయశాంతి కుటుంబం యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు అనిత.

Follow us on , &

ఇవీ చదవండి