Breaking News

కేవీఆర్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 12 మందికి గాయాలు


Published on: 20 Jan 2026 15:15  IST

రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళుతున్న KVR ట్రావెల్స్ స్లీపర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసు వాహనాలు, అంబులెన్సుల ద్వారా సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Follow us on , &

ఇవీ చదవండి