Breaking News

ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం


Published on: 19 Jan 2026 12:23  IST

జిల్లాలోని ఆరాంఘర్ చౌరస్తాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ.. యాక్టీవాపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి