Breaking News

తిరుమలలో ఏనుగుల హల్‌చల్..


Published on: 19 Jan 2026 12:18  IST

పార్వేటి మండపం వద్ద ఏనుగుల గుంపు మరోసారి హల్‌చల్ చేశాయి. ఆదివారం అర్ధరాత్రి తిరుమల అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు ఒక్కసారిగా రహదారిపైకి వచ్చింది. ఆ విషయాన్ని విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. ఆ వెంటనే వారు రంగంలోకి దిగారు. ఏనుగుల గుంపులను అటవీ ప్రాంతంలోకి తిరిగి వెళ్లేలా వారు చర్యలు చేపట్టారు.అయితే ఈ సమయంలో పాపవినాశనంకు భక్తుల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పిందని అటవీ శాఖ సిబ్బంది తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి