Breaking News

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ గ్రూప్ ‘వై’ పోస్టులు… నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ గ్రూప్ ‘వై’ పోస్టులు… నోటిఫికేషన్ విడుదల


Published on: 14 Jan 2026 17:56  IST

దేశ రక్షణ రంగంలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) శుభవార్త చెప్పింది. ఎయిర్‌మెన్ గ్రూప్ ‘వై’ కేటగిరీలో మెడికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

అర్హతలు (Eligibility)

 మెడికల్ అసిస్టెంట్ (నాన్-టెక్నికల్)

  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 / ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత ఉండాలి

  • ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులు తప్పనిసరి

  • మొత్తం మీద కనీసం 50 శాతం మార్కులు,

  • ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు సాధించి ఉండాలి

  • లేదా నాన్-వొకేషనల్ సబ్జెక్టులతో వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి (కనీసం 50%)

 మెడికల్ అసిస్టెంట్ (ఫార్మాసిస్ట్)

  • 10+2 స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్‌తో కనీసం 50% మార్కులు
    లేదా

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ ఫార్మసీ / బీఎస్సీ ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి

  • ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి

వయో పరిమితి (Age Limit)

మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్

  • అవివాహితులు మాత్రమే అర్హులు

  • వయస్సు: 17 నుంచి 21 ఏళ్లు

మెడికల్ అసిస్టెంట్ (ఫార్మాసిస్ట్)

  • అవివాహితులు:
     2003 జనవరి 1 నుంచి 2008 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి

  • వివాహితులు:
     2003 జనవరి 1 నుంచి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి

అప్లికేషన్ విధానం & ముఖ్య తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

  • అప్లికేషన్ ప్రారంభం: జనవరి 12

  • చివరి తేదీ: ఫిబ్రవరి 1

ఎంపిక విధానం (Selection Process)

ఎయిర్ ఫోర్స్ అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తుంది.

 ఫేజ్–1

  • ఆన్‌లైన్ రాత పరీక్ష

 ఫేజ్–2

  • డాక్యుమెంట్ల పరిశీలన

  • ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT–I & PFT–II)

  • అడాప్టబిలిటీ టెస్ట్–I (రాత పరీక్ష – ఆబ్జెక్టివ్ టైప్)

  • అడాప్టబిలిటీ టెస్ట్–II (ప్రస్తుత నిబంధనల ప్రకారం)

ఆన్‌లైన్ పరీక్ష వివరాలు

  • పరీక్ష పూర్తిగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది

  • CBSE 10+2 సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి

  • ముఖ్యంగా రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు

  • సమయం: 45 నిమిషాలు

  • ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు

  • ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగటివ్ మార్కింగ్

 ఫేజ్–1 ఆన్‌లైన్ పరీక్ష తేదీలు

  • 2026 మార్చి 30, 31

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iafrecruitment.edcil.co.in ను సందర్శించాలని అధికారులు సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి