Breaking News

తిరుమల దర్శించుకున్న సీఎం రేవంత్..


Published on: 30 Dec 2025 11:07  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను సందర్శించారు. ఇవాళ(మంగళవారం) ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. దేవాలయ అధికారులు రేవంత్ కుటుంబసభ్యులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న రేవంత్ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారికి పూజారులు శ్రీనివాసుడి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోవైపు సాధారణ భక్తులు తిరుమలకు పోటెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి