Breaking News

యువకుడి ప్రాణం తీసిన ఓటు పంచాయితీ..


Published on: 24 Dec 2025 17:14  IST

రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓటు వ్యవహారం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి.. తనకు ఓటు ఎందుకు వేయలేదని మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనిల్‌ను శంకరపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనిల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేశారు దర్యాప్తు జరుపుతున్నారు..

Follow us on , &

ఇవీ చదవండి