Breaking News

అనకాపల్లి తుపాకులతో బ్యాంకు దోపిడీకి యత్నం

అనకాపల్లిలో 2025 డిసెంబర్ 18, గురువారం మధ్యాహ్నం తుపాకులతో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం జరిగింది. అనకాపల్లి పట్టణం రింగ్ రోడ్డు సమీపంలోని కెనరా బ్యాంక్ శాఖ


Published on: 19 Dec 2025 10:57  IST

అనకాపల్లిలో 2025 డిసెంబర్ 18, గురువారం మధ్యాహ్నం తుపాకులతో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం జరిగింది. అనకాపల్లి పట్టణం రింగ్ రోడ్డు సమీపంలోని కెనరా బ్యాంక్ శాఖ.డిసెంబర్ 18, మధ్యాహ్నం సుమారు 2:30 నుండి 3:00 గంటల మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.రెండు వాహనాలపై మొత్తం ఏడుగురు దుండగులు వచ్చారు. వారిలో ఇద్దరు బయట కాపలా ఉండగా, ఐదుగురు తుపాకులతో బ్యాంకు లోపలికి ప్రవేశించారు.లోపలికి వచ్చిన దుండగులు తుపాకులతో బ్యాంక్ సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించారు.

 ఒక వ్యక్తి నేరుగా మహిళా బ్యాంక్ మేనేజర్‌ వద్దకు వెళ్లి తుపాకీతో భయపెట్టి నగదు ఇవ్వాలని కోరాడు. బ్యాంక్ మహిళా మేనేజర్ ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి, వెంటనే అలారం (సైరన్) నొక్కారు.సైరన్ మోగడంతో భయపడిన దుండగులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని ద్విచక్ర వాహనాలపై రైల్వే స్టేషన్ మీదుగా పారిపోయారు. మేనేజర్ సాహసంతో బ్యాంకులోని నగదు సురక్షితంగా ఉంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. 

Follow us on , &

ఇవీ చదవండి