Breaking News

మహాత్మా గాంధీకి రాం రాం!


Published on: 16 Dec 2025 12:44  IST

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇక నుంచి దాన్ని ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌-గ్రామీణ్‌’ (వీబీ-జీరామ్‌జీ) అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును ఎత్తేస్తున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సోమవారం పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ వీబీ-జీరామ్‌జీ 2025 బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి