Breaking News

ఓఎంసీ సుప్రీం కమిటీ నుంచి కలెక్టర్‌ తొలగింపు


Published on: 14 Nov 2025 12:30  IST

ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమ తవ్వకాలను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ, సర్వే, గనుల శాఖ జిల్లా స్థాయి అధికారులను కమిటీ నుంచి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ ఉత్తర్వులు జారీచేశారు. నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, ఆదేశాలు కచ్చితంగా పాటించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి