Breaking News

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు..!


Published on: 29 May 2025 09:31  IST

భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1010కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్‌లో ఎన్‌బీ 1.8.1, ఎల్‌ఎఫ్‌ 7, అనే కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని.. వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని గుర్తించింది. అందులోనూ.. జేఎన్‌ 1 సబ్‌ వేరియంట్‌ అయిన ఎన్‌బీ 1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement