Breaking News

అడ్వాన్స్‌డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స కోసం Rasonque అనే సరికొత్త మందును అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.

అడ్వాన్స్‌డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స కోసం Rasonque అనే సరికొత్త మందును అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 2026 ఆగస్టు 26న ఆమోదించింది. తీవ్రమైన ఈ క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో ఇది ఒక చారిత్రాత్మకమైన ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.

Published on: 27 Aug 2026 11:55  IST

అడ్వాన్స్‌డ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్స కోసం Rasonque అనే సరికొత్త మందును అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) 2026 ఆగస్టు 26న ఆమోదించింది. తీవ్రమైన ఈ క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో ఇది ఒక చారిత్రాత్మకమైన ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.

పనిచేసే విధానం: ఇది రోజుకు ఒకసారి వేసుకునే టాబ్లెట్. క్యాన్సర్ కణాలు విపరీతంగా పెరగడానికి కారణమయ్యే 'RAS' అనే నిర్దిష్ట ప్రోటీన్ మ్యుటేషన్‌ను (మార్పును) ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది.

క్యాన్సర్ శరీరం అంతటా వ్యాపించిన రోగులకు, ఇదివరకు కీమోథెరపీ తీసుకున్నా ఫలితం లేని వారికి ఈ మందును సిఫార్సు చేస్తారు.

జీవిత కాలాన్ని పెంచుతుంది: క్లినికల్ ట్రయల్స్ ప్రకారం, సాధారణ కీమోథెరపీ తీసుకునే రోగుల సగటు జీవిత కాలం 6.7 నెలలుగా ఉంటే, ఈ కొత్త మందు వాడిన వారి జీవిత కాలం దాదాపు రెట్టింపు అయ్యి 13.2 నెలల వరకు పెరిగినట్లు తేలింది.

దుష్ప్రభావాలు : ఈ మందు వల్ల చర్మంపై దద్దుర్లు , విరేచనాలు, వికారం, తీవ్రమైన అలసట వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు.

ఈ ఔషధాన్ని విదేశాలలో FDA ఆమోదించినప్పటికీ, భారతదేశంలో ఇది అందుబాటులోకి రావడానికి దేశీయ నియంత్రణ సంస్థల నుండి అనుమతులు రావాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి