Breaking News

భారత ప్రభుత్వం తిరుపతి, వారణాసి సహా మొత్తం 11 విమానాశ్రయాలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం

భారత ప్రభుత్వం తిరుపతి, వారణాసి సహా మొత్తం 11 విమానాశ్రయాలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.


Published on: 25 Aug 2026 11:34  IST

భారత ప్రభుత్వం తిరుపతి, వారణాసి సహా మొత్తం 11 విమానాశ్రయాలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఆగస్ట్ 4న జరిగిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అప్రైజల్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యాయి.

కీలక వివరాలు

రాయితీ కాలం: ఈ విమానాశ్రయాలను ప్రైవేట్ ఆపరేటర్లకు 50 ఏళ్ల కాల పరిమితి కోసం లీజుకు ఇవ్వనున్నారు.

మొత్తం పెట్టుబడి: ఈ 11 ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, విస్తరణ కోసం ప్రైవేట్ సంస్థలు దాదాపు రూ. 8,622 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

బిడ్డింగ్ విధానం: మార్కెట్లో ఒకే సంస్థ ఆధిపత్యాన్ని తగ్గించడానికి, ఒకే బిడ్డర్ అన్ని విమానాశ్రయాలను దక్కించుకోకుండా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గరిష్ట పరిమితిని విధించనుంది.

ఉద్యోగుల రక్షణ: ఎయిర్‌పోర్టులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన తర్వాత ఏడాది పాటు ఉమ్మడి నిర్వహణ ఉంటుంది. ఆ తర్వాత కనీసం 60% మంది AAI ఉద్యోగులను మూడేళ్ల పాటు ప్రైవేట్ ఆపరేటర్లు కొనసాగించాల్సి ఉంటుంది.

5 బండిల్స్‌గా విమానాశ్రయాల విభజన

ఆదాయాన్ని సమతుల్యం చేయడానికి పెద్ద (లాభదాయక) విమానాశ్రయాలను, చిన్న ఎయిర్‌పోర్టులతో కలిపి మొత్తం 5 బండిల్స్ (జంటలు) గా విభజించారు:

బండిల్ (విమానాశ్రయాలు)                                              అంచనా పెట్టుబడి

భువనేశ్వర్ – హుబ్బళ్లి                                                          రూ. 2,725 కోట్లు

వారణాసి - గయా – కుషీనగర్                                                రూ. 2,467 కోట్లు

రాయ్‌పూర్ – ఔరంగాబాద్                                                     రూ. 1,496 కోట్లు

తిరుపతి – తిరుచిరాపల్లి                                                       రూ. 1,411 కోట్లు

అమృత్‌సర్ – కాంగ్రా                                                            రూ. 523 కోట్లు

ఈ ప్రతిపాదనకు PPPAC తుది ఆమోదం లభించిన తర్వాత, తుది నిర్ణయం కోసం దీనిని కేంద్ర క్యాబినెట్ (CCEA) ముందుకు తీసుకెళ్లనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement