Breaking News

దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఆగస్టు 17, 2026 నుండి ప్రారంభం కావలసిన ఉమ్మడి సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని ట్రంప్ పెంటగాన్‌ను ఆదేశించారు.

దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆగస్టు 17, 2026 నుండి ప్రారంభం కావలసిన ఉమ్మడి సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని ట్రంప్ పెంటగాన్‌ను ఆదేశించారు.


Published on: 17 Aug 2026 12:33  IST

దక్షిణ కొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆగస్టు 17, 2026 నుండి ప్రారంభం కావలసిన ఉమ్మడి సైనిక విన్యాసాలను భారీగా తగ్గించాలని ట్రంప్ పెంటగాన్‌ను ఆదేశించారు.

ఇరాన్ వ్యవహారంలో నో చెప్పిన దక్షిణ కొరియా

ఇరాన్ అణ్వాయుధ నిర్మూలన (Denuclearization) విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వాలని, తమతో కలిసి రావాలని ట్రంప్ ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడిని కోరారు.అయితే, దక్షిణ కొరియా దీనికి "నో థాంక్స్" అని తిరస్కరించింది.తమ ప్రతిపాదనను తిరస్కరించడం వల్లే ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తన ట్రూత్ సోషల్ (Truth Social) పోస్ట్‌లో పేర్కొన్నారు.

కిమ్ జోంగ్ ఉన్‌తో మంచి సంబంధాలు

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో తనకు చాలా మంచి స్నేహసంబంధాలు ఉన్నాయని ట్రంప్ గుర్తుచేశారు.తాను వైట్ హౌస్‌లో ఉన్నంత కాలం ఉత్తర కొరియా ఎలాంటి బెదిరింపులకు పాల్పడకుండా, గౌరవప్రదంగా ఉందని ఆయన అన్నారు.

సైనిక విన్యాసాలపై ట్రంప్ అభ్యంతరాలు

దక్షిణ కొరియాతో కలిసి చేసే ఈ సైనిక విన్యాసాలు చాలా ఖర్చుతో కూడుకున్నవని ట్రంప్ పెదవి విరిచారు.ఈ ఖర్చంతా అమెరికాయే భరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇలాంటి విన్యాసాలు ఉత్తర కొరియాకు శత్రుత్వ సంకేతాలను పంపుతాయని, అవి అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితి:

ఆగస్టు 17 నుండి 27 వరకు జరగాల్సిన 'ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్' విన్యాసాలను పూర్తిగా రద్దు చేయడం ఇప్పుడు సాధ్యం కాదని ట్రంప్ చెప్పారు.అందుకే, ఈ విన్యాసాల పరిధిని భారీగా తగ్గించాలని రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ను ఆదేశించారు.అమెరికా రక్షణ దళాలపై ఆధారపడే దక్షిణ కొరియాకు, ఎంతో కీలకమైన సమయంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement