Breaking News

ఖమ్మంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడిపోయిన ఘటన

2 జూలై 2026 న ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం వైపు వెళ్తుండగా, ముందు భాగంలో యాక్సిల్‌ విరిగిపోవడంతో టైరు ఊడిపోయింది.


Published on: 02 Jul 2026 14:33  IST

2 జూలై 2026 న ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం వైపు వెళ్తుండగా, ముందు భాగంలో యాక్సిల్విరిగిపోవడంతో టైరు ఊడిపోయింది.

వైరా మండలం పరిధిలోని పినపాక బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు.యాక్సిల్‌ విరిగి టైరు ఊడిపోయిన వెంటనే బస్సు డ్రైవర్ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి బస్సును వెంటనే నిలిపివేయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.బ్రిడ్జిపై బస్సు నిలిచిపోవడంతో సత్తుపల్లి, భద్రాచలం, ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Follow us on , &

ఇవీ చదవండి