Breaking News

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఆపరేటర్ ఎయిర్‌ట్రంక్ , భారతదేశంలో క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం 30 బిలియన్ డాలర్ల  భారీ పెట్టుబడిని ప్రకటించింద

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఆపరేటర్ ఎయిర్‌ట్రంక్ , భారతదేశంలో క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం 30 బిలియన్ డాలర్ల  భారీ పెట్టుబడిని ప్రకటించింది.


Published on: 05 Jun 2026 17:28  IST

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఆపరేటర్ ఎయిర్‌ట్రంక్ , భారతదేశంలో క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక వసతుల అభివృద్ధి కోసం 30 బిలియన్ డాలర్ల  భారీ పెట్టుబడిని ప్రకటించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 5 గిగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లను నిర్మించడమే ఈ పెట్టుబడి ముఖ్య ఉద్దేశం.
జూన్ 5, 2026న న్యూఢిల్లీలో మోదీతో ఎయిర్‌ట్రంక్  సీఈఓ రాబిన్ ఖుదా సమావేశమైన అనంతరం ఈ అధికారిక ప్రకటన వెలువడింది.భారతదేశ డిజిటల్ సదుపాయాలలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడులలో ఇది ఒకటి.
ఈ పెట్టుబడి భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ కంపెనీలకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, దేశాన్ని గ్లోబల్ AI హబ్‌గా మార్చడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం X ద్వారా పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణ దశల్లో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభించనుంది.
ఎయిర్‌ట్రంక్ సంస్థ మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ  వంటి పలు రాష్ట్రాల్లో తన నెట్‌వర్క్‌ను విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'బ్లాక్‌స్టోన్' మద్దతు గల ఎయిర్‌ట్రంక్, ఈ ఏడాది ప్రారంభంలో 'లుమినా క్లౌడ్‌ఇన్‌ఫ్రా'ను కొనుగోలు చేయడం ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement