Breaking News

అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తూ, వాణిజ్య ట్రక్కులు నడుపుతున్న 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను యూఎస్ సరిహద్దు రక్షణ అధికారులు అరెస్ట్ చేశారు

అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తూ, వాణిజ్య ట్రక్కులు నడుపుతున్న 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను యూఎస్ సరిహద్దు రక్షణ అధికారులు అరెస్ట్ చేశారు. 'యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్' (CBP) సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, వీరందరినీ త్వరలోనే అమెరికా నుండి స్వదేశానికి బహిష్కరించనున్నారు .


Published on: 03 Jun 2026 11:15  IST

అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తూ, వాణిజ్య ట్రక్కులు నడుపుతున్న 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను యూఎస్ సరిహద్దు రక్షణ అధికారులు అరెస్ట్ చేశారు. 'యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్' (CBP) సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, వీరందరినీ త్వరలోనే అమెరికా నుండి స్వదేశానికి బహిష్కరించనున్నారు .అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత మరియు రోడ్డు భద్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ట్రంప్ యంత్రాంగం ఆపరేషన్ చెక్‌మేట్ పేరుతో భారీ తనిఖీలు చేపట్టింది.

అరిజోనాలోని 'యూమా సెక్టార్' సరిహద్దుల్లో బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఈ తనిఖీలు నిర్వహించారు.మే 11 నుండి 15 మధ్య జరిగిన ఈ ఆపరేషన్‌లో మొత్తం 52 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.వీరిలో 36 మంది కమర్షియల్ సెమీ-ట్రక్కులను నడుపుతూ పట్టుబడ్డారు. ఈ 36 మందిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన ఆరుగురు మెక్సికో, ఎల్ సాల్వడార్, రష్యా దేశాలకు చెందినవారు.

గడువు ముగిసిన పత్రాలు: అరెస్టయిన భారతీయులలో చాలా మందికి గత జో బైడెన్ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన 'ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ పత్రాలు' (వర్క్ పర్మిట్లు) ఉన్నాయి. అయితే వాటి గడువు ముగిసినప్పటికీ, వారు చట్టవిరుద్ధంగా అమెరికాలోనే ఉంటూ ట్రక్కులు నడుపుతున్నారు.

లైసెన్స్ నిబంధనల ఉల్లంఘన: వీరిలో కొందరి వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా వంటి రాష్ట్రాల వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులు (CDL) ఉన్నప్పటికీ, దేశంలో ఉండటానికి సరైన లీగల్ వీసా లేదు. మరికొందరి వద్ద అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదని అధికారులు గుర్తించారు.

అమెరికాలో ఇటీవల విదేశీ డ్రైవర్ల వల్ల జరిగిన కొన్ని ఘోర రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాణిజ్య వాహనాలపై నిఘా పెంచినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు భద్రతను కాపాడటానికి, నిబంధనలు ఉల్లంఘించే వలసదారులను అడ్డుకోవడానికి ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని యూమా సెక్టార్ యాక్టింగ్ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ డస్టిన్ కాడిల్ స్పష్టం చేశారు.ప్రస్తుతం అరెస్టయిన 30 మంది భారతీయులు ఇమ్మిగ్రేషన్ కస్టడీలో ఉన్నారు. ఫెడరల్ చట్టాల ప్రకారం చట్టపరమైన విచారణ పూర్తి కాగానే వీరిని భారత్‌కు డిపోర్ట్ చేయనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement