Breaking News

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 14 మే 2026 (గురువారం) ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Published on: 14 May 2026 17:29  IST

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 14 మే 2026 (గురువారం) ఉదయం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా తొలిసారి ఎన్టీఆర్ క్యాబినెట్‌లో 1986 మే 14న ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రిగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సరిగ్గా 40 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయనకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

పూజ్యులు ఎన్టీఆర్ గారి పాలనలోనే తనకు భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేసే గొప్ప భాగ్యం దక్కిందని మంత్రి మీడియాతో పంచుకున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.351 కోట్లతో రామాలయ పునరాభివృద్ధి పనులకు భూమి పూజ జరిగిందని, భద్రాద్రి రాముని ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement