Breaking News

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి స్వాధీనం

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో 17 ఏప్రిల్ 2026, శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Published on: 17 Apr 2026 16:13  IST

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో 17 ఏప్రిల్ 2026, శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు భారీగా హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి సుమారు 3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకాక్ నుండి థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఒక మహిళా స్మగ్లర్‌ను అధికారులు అరెస్ట్ చేశారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.బ్యాంకాక్ నుండి వచ్చిన సదరు మహిళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో, అధికారులు ఆమె లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో లగేజీ బ్యాగుల్లో రహస్యంగా దాచిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.

Follow us on , &

ఇవీ చదవండి